Rishabh is expected to be rewarded for his outstanding performance as DC captain, as he will reportedly be named captain for the UAE portion of the season. So Rishabh Pant will continue to captain the side even in the presence of Iyer.
#RishabhPant
#DelhiCapitals
#ShreyasIyer
#IPL2021
#ShikharDhawan
#PrithviShaw
#Cricket
#TeamIndia
ఐపీఎల్ 2021 మలిదశ మ్యాచ్‌లకు శ్రేయస్ అయ్యర్ అందుబాటులోకి రావడంతో ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యంకు పెద్ద తలనొప్పి వచ్చిపడిన విషయం తెలిసిందే. కెప్టెన్ విషయంలో ఢిల్లీ మేనేజ్మెంట్ ఇన్నాళ్లు ఎటూ తేల్చుకోలేకపోయింది. ఐపీఎల్ 2021 తొలి దశలో వరుస విజయాలు అందించిన రిషబ్ పంత్‌కు జట్టు పగ్గాలు అందించాలా లేదా గతేదాడి జట్టును ఫైనల్ చేర్చిన శ్రేయస్‌కు అప్పగించాలా అని తర్జనభర్జన పడింది. అయితే చివరికి కెప్టెన్సీ విషయంలో ఢిల్లీ మేనేజ్మెంట్ ఓ నిర్ణయం తీసుకుందట. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న పంత్‌ను సారధ్య బాధ్యతల్లో యధావిధిగా కొనసాగించాలని నిర్ణయించిందని ఓ స్పోర్ట్స్ ఛానెల్ తమ కథనంలో పేర్కొంది.